నేహా కక్కర్‌కు ప్రెగ్నెన్సీ.. షాక్ అవుతున్న నెటిజన్లు

by Shyam |
నేహా కక్కర్‌కు ప్రెగ్నెన్సీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్, గాయకుడు రోహన్‌ప్రీత్ సింగ్ జంట.. ఫస్ట్ బేబీని ఎక్స్‌పెక్ట్ చేయబోతున్నారు. దీనిపై న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా సరే.. నేహా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాత్రం ఆ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న తనను రోహన్ ఆప్యాయంగా పట్టుకున్న ఫొటో పోస్ట్ చేసిన నేహా.. జాగ్రత్తగా చూసుకోవాలనే ట్యాగ్ తగిలించింది. దీనిపై స్పందించిన రోహన్.. అవును ఈ టైమ్‌లో నిన్ను ఎక్స్‌ట్రా కేరింగ్‌గా చూసుకోవాలని చెప్పాడు. అక్టోబర్ 24న నేహా, రోహన్ మ్యారేజ్ కాగా హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా నేహా పోస్ట్‌తో నెటిజన్లు షాక్ అవుతున్నారు. రెండు నెలల్లో ప్రెగ్నెంట్ ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. నేహా పెళ్లికి ముందే ప్రెగ్నెంటా ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నారు.

Advertisement

Next Story