- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రెస్ట్ ఫీడింగ్‌ను సెక్సువలైజ్ చేయొద్దు : నేహా ధూపియా
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ నేహా ధూపియా ‘ఫ్రీడమ్ టు ఫీడ్’ అవేర్‌నెస్‌లో భాగంగా తన కూతురు మెహర్‌కు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న ఫొటో షేర్ చేసింది. తల్లి అయినందుకు హ్యాపీగా ఉన్నా.. తనకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? తల్లులు ఎమోషనల్‌గా ఎంత డ్రెయిన్ అవుతారనే విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. అమ్మగా ఉండడం చాలా కష్టమని, ఇన్ని చేసినా సరే చివరికి.. ఏం చేస్తున్నావని ప్రశ్నించడం, ఎగతాళి చేయడం, ట్రోల్స్ చేయడం జనాలకు అలవాటైపోయిందని చెప్పింది. తను కూడా అలాంటి బాధలు ఎదుర్కొన్నానని వివరించింది.
ఈ పోస్ట్‌పై చాలా మంచి రెస్పాన్స్ వచ్చినా, ఓ వ్యక్తి మాత్రం ట్రోల్ చేయడం ప్రారంభించాడు. బ్రెస్ట్ ఫీడింగ్‌ను సెక్సువలైజ్ చేస్తూ.. కూతురికి పాలు ఇస్తున్న వీడియో పోస్ట్ చేయొచ్చు కదా! అని అడిగాడు. దీనిపై స్పందించిన ఓ మహిళ.. ముందు నీ తల్లి, నీ నానమ్మ/అమ్మమ్మకు సంబంధించిన వీడియో సెండ్ చేస్తే తను కూడా కచ్చితంగా పోస్ట్ చేస్తుందని సమాధానమిచ్చింది. ఈ కన్వర్జేషన్ స్క్రీన్‌షాట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయగా.. పలువురు మహిళలు స్పందించారు. తమ పిల్లలకు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న ఫొటోలను సెండ్ చేశారు. వీటన్నింటిని తన స్టోరీస్‌లో షేర్ చేసిన నేహా.. తాము బ్రెస్ట్ ఫీడింగ్‌ను నార్మలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఇలాంటి వారు ఇంకా దాన్ని సెక్సువల్ మ్యానర్‌లోనే చూస్తున్నారని ఫైర్ అయింది. ఇప్పటికైనా ఆ విషయాన్ని సాధారణంగా చూడాలని కోరింది.