- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంగద్‌తో ఉన్నదెవరు ? : నేహాధూపియా

దిశ, వెబ్ డెస్క్: పర్యాటకులకు భూతల స్వర్గంగా పేరుపొందిన ప్రదేశం మాల్దీవులు. చాలా మంది సెలెబ్రిటీలకు ఇది ఫేవరెట్ స్పాట్. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజిబిజీగా గడిపే స్టార్స్.. తమకు కాస్త గ్యాప్ దొరికితే చాలు.. రిఫ్రెష్ అయ్యేందుకు తమ ఫ్యామిలీతో కలిసి ఎవరూ గుర్తుపట్టని విహార ప్రాంతానికి లేదా తమ ఫేవరెట్ వెకేషన్ స్పాట్‌కు వెళ్తుండటం కామన్. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హాట్ కపుల్ నేహా ధూపియా, అంగద్ బేడీ కపుల్ మాల్దీవుల్లోని ప్రకృతి అందాల్లో సరదాగా సేద తీరుతున్నారు.
బాలీవుడ్ భామ నేహాధూపియా తన లైఫ్ పార్టనర్ అంగద్ బేడీతో కలిసి మాల్దీవుల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగానే.. తాను అంగద్ వెనక నిలబడి, తన ముఖం కవర్ చేసేలా క్యాప్ పెట్టుకున్న ఫొటోను పంచుకుంటూ.. ‘అంగద్ బేడీ మాల్దీవుల్లో ఎవరో బ్లాక్ బికినీ వేసుకున్న అమ్మాయితో కనిపించాడు. నేను బాధపడాలా?’ అని తన ఇన్‌స్టా అభిమానులను అడిగింది. నేహా, అంగద్‌ల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇటీవలే తాప్సీ కూడా తన సిస్టర్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. తాప్సీ కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి రిఫ్రెష్ అయ్యింది.