మంత్రి అనిల్ కుమార్‌కు కరోనా నెగిటివ్

by vinod kumar |   ( Updated:2020-04-06 21:58:12.0  )
మంత్రి అనిల్ కుమార్‌కు కరోనా నెగిటివ్
X

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా పరీక్షలో నెగిటివ్ తేలింది. ఇటీవల కరోనా సోకిన ఓ డాక్టర్ మంత్రిని కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దీంతో మంత్రి 48 గంటల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నారు. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు డాక్టర్లు చేసిన కరోనా పరీక్షలో నెగిటివ్ రావడంతో నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి అనిల్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదు అయ్యాయి.

Tags: ap minister, anil kumar, corona, negative report

Advertisement

Next Story