మళ్లీ అదరగొట్టిన నీరజ్ చోప్రా..!

by Shamantha N |
Neeraj Chopra
X

దిశ, వెబ్ డెస్క్: నీరజ్ చోప్రా.. ఈ పేరు ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో ప్రపంచమంతటా మార్మోగింది. జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తాజాగా.. మరోసారి నీరజ్ సంచలనంగా మారాడు. ఓ ప్రకటనలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆ ప్రకటనలో ఉన్న నీరజ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాజాగా.. క్రెడ్ క్లబ్ రూపొందించిన ప్రకటనలో నీరజ్ ఒక బిజినెస్ మ్యాన్‌గా, రిపోర్టర్‌గా, బ్యాంక్ అధికారిగా, సినీ దర్శకుడిగా నటించాడు. అంతేకాదు.. జావెలిన్ త్రో ఔత్సాహికుడిగానూ కనిపించాడు. ఈ యాడ్ చూసిన నెటిజన్స్ అసలు అతడు నీరజ్ చోప్రానేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఆ వీడియోను ఇతరులకు షేర్ చేశారు. నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది బాలీవుడ్ స్టార్ల కన్నా యూ ఆర్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Advertisement

Next Story