ఆ మూడు జిల్లాల్లో రోజూ 3000 పరీక్షలు చేయండి: సీఎస్

by srinivas |
ఆ మూడు జిల్లాల్లో రోజూ 3000 పరీక్షలు చేయండి: సీఎస్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇంకోవైపు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ జిల్లాల్లో రోజుకు 3వేల వరకూ టెస్ట్‌లు చేయాలని ఏపీ సీఎస్ నీలం సాహ్నీ వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా పలు సూచనలు చేశారు. జ్వరం, దగ్గు, తీవ్రమైన జలుబు, ఎర్రబారిన కళ్లు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాధమిక, సెకెండరీ సర్వైలెన్స్ బృందాల ద్వారా కరోనా టెస్టుల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. మరణాలు సంభవిస్తున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed