- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మైనర్ల సెక్స్, డ్రగ్ యూజ్.. ‘బాంబే బేగమ్స్’ నిలిపేయాలని నోటీసులు

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘బాంబే బేగమ్స్’ స్ట్రీమింగ్ నిలిపివేయాలని ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు 24 గంటల్లో యాక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సూచించింది. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఐదుగురు మహిళల కథ ఆధారంగా రూపొందిన సిరీస్‌లో పిల్లల గురించి అనుచితంగా చిత్రీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
మైనర్లు సెక్స్ గురించి మాట్లాడటం, మాదకద్రవ్యాలు సేవించడం లాంటి కంటెంట్‌తో ఉన్న సిరీస్.. యంగ్ మైండ్స్‌ను కలుషితం చేస్తుందని, తప్పుదోవ పట్టిస్తుందని కమిషన్ అభిప్రాయపడింది. పిల్లల కోసం లేదా పిల్లల కంటెంట్ ప్రసారం చేసేటప్పుడు నెట్‌ఫ్లిక్స్ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి చిక్కులు ఎదుర్కోకుండా ఉంటుందని నోటీసులో పేర్కొంది కమిషన్. వెంటనే ‘బాంబే బేగమ్స్’ ప్రసారం నిలిపివేయకపోతే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సెక్షన్ 14 ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.