- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ కేసు… ఎన్సీబీ ఆఫీస్‌కు హీరోయిన్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది. ఇందుకోసం శనివారం ఉదయమే ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ చేరుకున్నారు. దీపికాకు, కరిష్మాకు మధ్య జరిగిన చాటింగ్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీపికా సమాధానాలు సంతృప్తికరంగా లేవని అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రద్ధను మరో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బృందం ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో శ్రద్ధ, జయసాహాకు మధ్య జరిగిన చాటింగ్‌పై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ… కరీష్మాతో సాధారణ సంబంధాలు తప్పా, డ్రగ్స్ సంబంధిత సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
మరోవైపు 2019 నాటి కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. దీనిపై కరణ్‌ను ప్రశ్నించగా, తానెప్పుడూ డ్రగ్స్ సప్లై చేయలేదని కరణ్ జోహర్ బుకాయింపు సమాధానాలు చెబుతున్నారు. కాగా దీనిపై రేపో, మాపో కరణ్‌కు కూడా ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేయనున్నట్టు తెలిసింది. ఈ డ్రగ్స్ వ్యవహారమై రకుల్ ప్రీత్ సింగ్ విచారణ శుక్రవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని రకుల్ వెల్లడించింది. అంతేగాకుండా తన దగ్గర రియా చక్రభర్తి డ్రగ్స్ దాచుకుందని తెలిపింది. కాగా శనివారం దీపికా, శ్రద్ధాలపై విచారణ ముగిసిన తర్వాత మరోసారి రకుల్‌ను విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.