- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రగ్ డీలర్లతో నాకేంటి పని: రకుల్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించడంతో.. పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి చాటింగ్‌లో సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటపడడంతో ఎన్సీబీ అధికారులు విచారణకు హాజరకావాల్సిందిగా నోటీసులు పంపారు.
దీంతో శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ ప్రీత్ సింగ్ హాజరైంది. విచారణ ముగిసిన తర్వాత రకుల్ మాట్లాడుతూ.. తాను డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. డ్రగ్ డీలర్లతో తనకేమి సంబంధం లేదని అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో రేపు దీపికా పదుకునే ఎన్సీబీ అధికారుల విచారణకు హాజరుకానుంది.
Next Story