దుల్కర్‌కు నజ్రియా కూలెస్ట్ విష్..

by  |
దుల్కర్‌కు నజ్రియా కూలెస్ట్ విష్..
X

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హ్యాండ్సమ్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేసింది దుల్కర్ బెస్ట్ ఫ్రెండ్, రాజా రాణి ఫేమ్ నజ్రియా ఫహద్. ‘కుకింగ్, ఎంటర్‌టైనింగ్ ఇలా అన్నింటిలోనూ నువ్వు బెస్ట్ బమ్’ అంటూ విష్ చేసిన నజ్రియా.. నన్ను ఇరిటేట్ చేయడం, కాళ్లు లాగి కింద పడేయడంలోనూ బెస్ట్ అని తెలిపింది. కుంజీ( నజ్రియా) కాల్ చేసినప్పుడు ఎప్పుడూ లిఫ్ట్ చేయాలన్న ఈ క్యూట్ హీరోయిన్.. బెస్ట్ డాడీ, బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ బ్రదర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో తనకు అంతా మంచే జరగాలని కోరుకున్న నజ్రియా.. దుల్కర్ చేసిన బర్గర్ తిన్నాక తన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అంటూ ఎమోజీలు సెండ్ చేసింది.

https://www.instagram.com/p/CDLBCzTJIIG/?igshid=7au5dv0tykjj

ఇక దుల్కర్‌కు బర్త్‌డే గ్రీటింగ్స్ అందిస్తూ.. తన లేటెస్ట్ మలయాళీ చిత్రం ‘కురుప్’ నుంచి స్నీక్ పిక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో దుల్కర్ లుక్ సూపర్ కూల్‌గా ఉండగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన సినిమాను వెఫేర్ ఫిల్మ్స్, ఎంస్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.you Thank you Thank you for all your love and wishes. #Kurup #Wayfarerfilms #MstarEntertainments https://youtu.be/Ere0wfYzRsQ


Next Story