- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓటీటీలో నయన్ మూవీ?

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మూకుతి అమ్మన్’. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడగా.. సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమైనట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు ఆర్జే బాలాజీ.
మే 1న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అన్ని సినిమాల మాదిరిగానే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. దీంతో సినిమా వెంటనే పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుధ పూజ రోజున సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందని సమాచారం. దీంతో నయన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. చాలా రోజులుగా అభిమాన తార సినిమాకు దూరంగా ఉన్న అభిమానులు ఈ న్యూస్‌తో పండగ చేసుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ముందుగా ఈ సినిమా సెటైరికల్ కామెడీ అని భావించినా.. ఫుల్ లెంగ్త్ డివోషనల్ ఫిల్మ్ అని క్లారిటీ ఇచ్చారు దర్శక, నిర్మాతలు.