ఈ గుసగుస నయనతార గురించే!

by  |
ఈ గుసగుస నయనతార గురించే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి చర్చించుకుంటున్నారు. త్వరలో ఈ ముద్దుగుమ్మ అలా చేయబోతోందని గుసగుసలు పెట్టుకుంటున్నారు. విషయమేమిటంటే.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి వీరి ప్రేమాయణం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. అయితే తాజాగా వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలో ఈ జోడీ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేరళలోని ఓ దేవాలయంలో వీరు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని చర్చించుకుంటున్నట్లు తెలిసింది. నిజానికి ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేశాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది. అయితే త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటవుతున్నారని సమాచారం.


Next Story

Most Viewed