ఓటీటీ‌లో నయన్ ఎంటర్‌టైన్మెంట్

by Jakkula Samataha |   ( Updated:2023-12-16 18:15:31.0  )
nayanatara 1
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి ఓటీటీలో సందడి చేయనుంది. గతేడాది ‘అమ్మోరు తల్లి’ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన నయన్.. ఈ ఏడాది మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. తను లీడ్ రోల్ ప్లే చేస్తున్న తమిళ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘నెట్రికన్’ గతేడాది థియేటర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆగిపోయింది.

కాగా రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ సినిమాకు మిలింద్ రావు దర్శకత్వం వహించగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. అయితే మేకర్స్ జూలై 9న హాట్‌స్టార్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయించగా.. త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కొరియన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘బ్లైండ్’ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అంధురాలిగా కనిపించనుంది నయన్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ఆడియన్స్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story