- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగాస్టార్ సినిమాలో విలన్‌గా నవాజుద్దీన్…!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ‘లూసిఫర్’ రిమేక్, దాని తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఒక సినిమా, డైరెక్టర్ బాబీతో మరో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దర్శకుడు బాబీతో చేసే సినిమాలో చిరు సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇదే సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించేందుకు బాలీవుడ్ టాలెంటడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ను మేకర్స్ సంప్రదించనట్లు సమాచారం. అంతేకాకుండా హీరో మెగాస్టార్ కావడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనలు జరుతున్నాయి. అని కుదిరాక ఆధికారికంగా ప్రకటిస్తారెమో చూడాలి మరి.
Next Story