నవనీత్ కౌర్ కోసం సీఎంకు రక్తంతో లేఖ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడ్డ సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని తన రక్తంతో లేఖ రాసి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. నవనీత్ కౌర్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని రక్తంతో రాసిన లేఖలో కోరాడు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర సీఎం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాగా, ఇటీవల నవనీత్ కౌర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్, ఆమె భర్త రవితో సహా మరో 11 మందికి కరోనా సోకింది. వీరందరూ కూడా హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తొలుత అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరిన నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే నాగ్‌పూర్ లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడలేదు.

అయితే, గురువారం ఒక్కసారిగా తీవ్ర మైన ఛాతి నొప్పి రావడంతో.. హుటాహుటిన ముంబయిలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుకున్న ఓ అభిమాని ఆమెకు మెరుగైన చికిత్స అందించాలంటూ సీఎంకు రక్తంతో లేఖ రాయడం గమనార్హం.

Advertisement