'బాక్సర్‌' వరుణ్ .. 'విలన్' నవీన్

by Shyam |
బాక్సర్‌ వరుణ్ .. విలన్ నవీన్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సరికొత్త కథలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కెరియర్ రన్ చేస్తున్నాడు. ‘గద్దల కొండ గణేష్‌’గా గజగజ వణికించిన వరుణ్… ఇప్పుడు ‘బాక్సర్‌’గా రింగ్‌లో ఫైట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చే సినిమాలో వెండితెరపై కిక్ బాక్సింగ్ చేయనున్న వరుణ్… పర్‌ఫెక్షన్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే వరుణ్‌కు తగిన విలన్‌ను వెతికేందుకు చాలా కష్టపడిన డైరెక్టర్ నవీన్ చంద్రను సెలెక్ట్ చేసుకున్నాడు. దీనికోసం హైదరాబాద్‌లో 45 రోజుల ట్రైనింగ్ తీసుకున్న నవీన్… ఇందులో క్యారెక్టర్ కోసం కేవలం బాడీ మీద కాన్సంట్రేట్ చేయడం మాత్రమే కాదు బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడట. ప్రస్తుతం వైజాగ్‌లో జరగుతున్న షూటింగ్‌లో జాయిన్ అయ్యాడట. ఇది సినిమా క్లైమాక్స్ కాగా… వరుణ్, నవీన్ చంద్రల బాక్సింగ్ సమరం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాలో నవీన్ చంద్ర ఎన్టీఆర్‌కు విలన్‌గా కనిపించారు. ఆ సినిమాలో పక్కా ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించేందుకు నవీన్ ఎంతగా కష్టపడ్డాడో అంతకు మించి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు బాక్సర్ చిత్రంలో పాత్ర కోసం కూడా అంతే పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాట.

Tags: Varun Tej, Naveen Chandra, Kiran Korrapati, Boxer

Advertisement

Next Story