- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ..
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ పీసీసీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం అక్కడి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌కు ప్రధాన అభ్యర్థిగా సిద్ధూ మారారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య అంతర్గత పోరు గత కొన్నాళ్లుగా నడుస్తోంది. తనకు పోటీగా వస్తున్నాడనే కారణంతో సిద్దూను ముఖ్యమంత్రి పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇరువురిని ఢిల్లీకి పిలిపించింది. సిద్దూను శాంతింపజేసేందుకే ఆయనకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టినట్లు పంజాబ్ కాంగ్రెస్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.