ఆసక్తిరేపుతున్న నవదీప్ ‘రన్’ ట్రైలర్

by Shyam |
ఆసక్తిరేపుతున్న నవదీప్ ‘రన్’ ట్రైలర్
X

లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. ఇదే కోవలో న‌వ‌దీప్ న‌టించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఫిల్మ్ ‘ర‌న్’ కూడా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో మే 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఆదివారం విడుదలైన రన్ ట్రైలర్‌లో.. ‘కొత్తగా పెళ్లైన జంట ఇంట్లో అడుగుపెట్టగా మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ మిస్టరీ చేధించడానికి పోలీసులు ట్రై చేస్తుంటే, నవదీప్ కూడా ఆ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుపోతాడు. ఆరుగురు వ్యక్తుల చుట్టూ సాగే ఈ మర్డర్ మిస్టరీలో ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నదే ఈ చిత్ర కథ. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు. నవదీప్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, కౌసల్య, మనాలి రాథోడ్, షఫీ, మధు నందన్, భాను శ్రీ, కిరీటి దామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Next Story