ఇంటి సామాను షిఫ్టింగ్‌‌లో హెల్ప్ చేస్తే రూ. 2 లక్షలు!

దిశ, వెబ్‌డెస్క్ : అద్దె ఇంటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటి ఓనర్‌కు కోపం వచ్చినా, మనకు నచ్చకపోయినా.. ఇల్లు ఖాళీ చేయాల్సింది మనమే. ఇక ఖాళీ చేసిన తర్వాత మరో ఇంటిని వెతుక్కోవడం ఓ టాస్క్ అయితే.. సామానును షిఫ్ట్ చేయడం అన్నింటికంటే పెద్ద టాస్క్. డబ్బులు పెట్టగలిగితే.. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చేసి మన పనిని ఈజీ చేస్తారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ సంస్థకు చెందినవారు కాస్త అజాగ్రత్త వహించినా, మన వస్తువులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే, వారికి ముందే కండిషన్స్ అప్లయ్ అని చెప్పేస్తారు. ఇదంతా ఓకే కానీ.. బ్రిటన్‌కు చెందిన ఓ జంట మాత్రం వినూత్నమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. హౌస్ షిప్టింగ్‌లో హెల్ప్ చేసే పర్సన్‌కు వారు రూ.2 లక్షలు ఆఫర్ చేస్తుండటం విశేషం. కానీ ఇక్కడ కూడా షరుతులు వర్తిస్తాయంట, ఇంతకీ ఆ షరతులేంటో చూద్దాం!

ఇంటి సామాను షిఫ్ట్ చేసేందుకు ఎన్నో ‘ప్యాకర్స్ అండ్ మూవర్స్’ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. బ్రిటన్‌లో ఇలాంటి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో ఓ జంట వినూత్నమైన పోస్ట్ పెట్టింది. అదేంటంటే.. తమ ఇంట్లో సామాన్లు షిఫ్ట్ చేయడానికి సాయం చేస్తే వ్యక్తి లేదా వ్యక్తులు తప్పకుండా నగ్నంగా ఉండాలన్నదే వాళ్ల కండిషన్. వాళ్లు నేచరిలిస్ట్ కపుల్స్. అంటే నగ్నత్వాన్ని ఇష్టపడే వ్యక్తులన్నమాట. ‘మా ఇంట్లో వస్తువులను షిఫ్ట్ చేయడానికి ఒక డ్రైవర్ కావాలి. ప్యాకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని పనుల్లో సాయం చేయాలి. అయితే, అతడు శరీరంపై క్లాత్స్ ధరించకూడదు. మేం వెకేట్ చేస్తున్న ప్లేస్ నుంచి అద్దెకు తీసుకున్న ఇల్లు దాదాపు 15 మైళ్లు ఉంటుంది. ఇందులో సాయం చేస్తే.. మేం అతనికి 2 వేల పౌండ్లు (రూ. 2 లక్షలు) చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.

అయితే షిఫ్టింగ్ సంస్థకు మార్కెట్‌లో మంచి పేరు ఉండటంతో.. తమ సంస్థ సభ్యులను కాకుండా, వేరే వారిని సంప్రదిస్తోంది. అందుకోసం వెబ్‌సైట్ బహిరంగ ప్రకటన చేసింది. ఎవరికైనా ఆసక్తి ఉంటే తమని సంప్రదించాలని, కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే సెప్టెంబర్ మధ్యలో ఆ జంట ఇల్లు వెకేట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. మరి ఆ లోపుగా ఈ ప్రకటనను చూసి ఎంతమంది వస్తారో చూడాలి.

ఆ జంట గత 5 సంవత్సరాల నుంచి నేచరిలిస్ట్స్(నగ్నంగా)గా ఉంటోంది.

Advertisement