ఈనెల 10 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు

by Shyam |
ఈనెల 10 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు
X

దిశ, సూర్యాపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సంయుక్తంగా దేశవ్యాప్త ఆందోళనలు చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు తెలిపారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కేవలం రెండు కోట్ల మందికి మాత్రమే వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, అది కూడా సంవత్సరానికి వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 237 రూపాయల వేతనం ఇవ్వకుండా, ఏమాత్రం అవగాహన లేని పంచాయతీరాజ్ కార్యదర్శులు, ఉపాధి కూలీలకు రోజుకు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారంటూ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కూలీల వ్యతిరేక ఆర్థిక విధానాలు ముఖ్యంగా వ్యవసాయాన్ని, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసేందుకు, దేశ విదేశీ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తూ ప్రైవేటీకరణకు పూనుకుందని అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్, అఖిల భారత కిసాన్ సభ సంయుక్తంగా పిలుపునిచ్చాయి అని ఆయన తెలిపారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని, కొవిడ్- 19 వల్ల పనిలేక పస్తులు ఉంటున్న నిరుపేద కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి ఆరునెలలపాటు ప్రతి వ్యక్తికి పది కేజీల సన్నబియ్యం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని అర్హులైన కష్టజీవులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఎం నరేష్, మధు నాయక్, రూపావత్ బాలు, భూక్య పంతులు, ఎస్ కే జాన్, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed