- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో కరోనా విజృంభన.. కొత్తగా ఎన్నికేసులంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే కొత్తగా 3.79 లక్షల కేసులు నమోదయ్యాయి. మరణాలూ మూడున్నర వేలను మించాయి. దేశవ్యాప్తంగా టీకాల కొరత, ఆక్సిజన్, హాస్పిటల్ పడకల కొరత మధ్య విలవిల్లాడుతుండగా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూ విలయాన్ని సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 3,79,257కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క రోజే 3645 మంది కరోనా బారినపడి మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 1,83,76,524కు, మొత్తం మరణాలు 2,04,832కు చేరాయి.
30 లక్షలను దాటిన యాక్టివ్‌లు
ఈ నెలలో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్లు, ఇండియన్ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్‌లు చాపకిందనీరులా వ్యాప్తికి కారణమవుతుండగా క్రియాశీలక కేసులు భారీగా పెరుగుతున్నాయి. యాక్టివ్‌లతోనూ కొత్త కేసుల పెరిగే ముప్పు ఎక్కువ ఉన్నది. ఏప్రిల్ 1న 5.84 లక్షలుగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య తాజాగా 30 లక్షలను దాటింది. గురువారం ఉదయానికి కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు 30,84,814కు చేరాయి. ఇటీవలి రోజుల్లో యాక్టివ్ కేసులు రోజుకు కనీసం లక్ష చొప్పున పెరుగుతుండటంతో విస్ఫోటనంలా మొత్తం కేసులు పెరిగాయి.