- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జొమాటో.. ట్విట్టర్ వేదికగా సీఈవో గోయల్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో శాఖాహారం సప్లై చేసే డెలివరీ బాయ్స్ డ్రెస్ విషయంలో వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జొమాటో సీఈవో దీపెందర్ గోయల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. శాఖాహారుల ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇక నుంచి ఆకుపచ్చ రంగు దుస్తులు దరించనున్నారని, వారికోసం సరికొత్త ప్లాట్ ఫాంని తీసుకొస్తున్నామని, దీనిపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని దీపేందర్ గోయల్ నిన్న జొమాటో కష్టమర్లను కోరారు.
దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో గ్రీన్ డ్రెస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని, ఇక నుంచి వెజ్, నాన్ వెజ్ ఫుడ్ విడివిడిగా ఎరుపు రంగు దుస్తులు కలిగిన డెలివరీ బాయ్స్ కష్టమర్లకు అందిస్తారని తెలిపారు. ఈ విషయంలో మా రైడర్ల భద్రత మాకు ముఖ్యమైనదని, అలాగే ఈ నిర్ణయం వల్ల కొందరు కష్టమర్లు ఇబ్బందుల్లో పడవచ్చని మా దృష్టికి వచ్చినందు వల్ల మేము తీసుకున్న గ్రీన్ డ్రెస్ నిర్ణయాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. అంతేగాక గత రాత్రి ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేసినందుకు కష్టమర్లకు ధన్యవాదాలు తెలిపుతూ.. అనవసరమైన అహంకారం గర్వం ఎప్పుడూ లేకుండా మీ అభిప్రాయాలు ఎప్పుడూ వింటూనే ఉంటామని, మీకు సేవ చేయడానికి ఎదురుచూస్తామని దీపేందర్ గోయల్ రాసుకొచ్చారు.