ఆర్ఎస్ఎస్ ఛీఫ్ తో భేటీ కానున్న యోగి ఆదిత్యనాథ్.. ఎందుకంటే?

by Shamantha N |
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ తో భేటీ కానున్న యోగి ఆదిత్యనాథ్.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ కానున్నారు. శనివారం ఆర్ఎస్ఎస్ శిక్షణా సమావేశాల్లో వీరిద్దరూ సమావేశం కానున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బుధవారం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శిక్షణా సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగనున్నాయి. ఇప్పటికే వారణాసి, గోరఖ్‌పూర్, కాన్పూర్, అవధ్ ప్రాంతాల్లో సంఘ్ బాధ్యతలు నిర్వహిస్తున్న 280 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో మోహన్ భగవత్ మాట్లాడారు. సంఘ్ విస్తరణ, సామాజిక సమస్యలపై చర్చించారు. సంఘ్ నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టుల విస్తరణపై సూచనలు కూడా ఇచ్చారు.

బీజేపీపై ఆర్ఎస్ఎస్ విమర్శలు

బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పకున్నా కోపంగా ఉన్నట్లు అర్థమవుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ ని పట్టించుకోకపోవడమే కారణమని తెలుస్తోంది. ‘నిజమైన సేవక్ కు అహంకారం ఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’’ అంటూ ఇటీవలే మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే మరోనేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. అహంకారులుగా వ్యవహరించిన వారిని 241 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు. ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎశ్ పత్రిక ఆర్గనైజర్ లో ఓ స్టోరీ కూడా పబ్లిష్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసానికి నిదర్శమని.. వారితో పాటు నేతలంతా మోడీపైనే ఆధారపడ్డారని పేర్కొంది. ప్రజల గొంతుకలను వినలేదని అందులో వ్యాఖ్యానించింది. ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీని మెజారిటీ మార్కుకు దూరం చేశాయి. 2014, 2019లో బీజేపీ యూపీలో 60కి పైగా సీట్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కేవలం 33 సీట్లే వచ్చాయి. ఇలాంటి సమయంలో సీఎం యోగి, మోహన్ భగవత్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Next Story