- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది ఉడ్‌ల్యాండ్ రూ. 1,200 కోట్ల అమ్మకాల లక్ష్యం!
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ ఉడ్‌ల్యాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిద్వారా సుమారు రూ. 1,200 కోట్ల విలువైన అమ్మకాలను అంచనా వేస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హర్‌కీరత్ సింగ్ అన్నారు. కరోనా మహమ్మారికి ముందు స్థాయిలో వినియోగదారులు స్టోర్లకు తిరిగి రావడంతో అమ్మకాలు పెరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉడ్‌ల్యాండ్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న ఏరో క్లబ్ కరోనా సమయంలో దాదాపు 50 స్టోర్లను మూసేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త స్టోర్లను తెరుస్తున్నామని, ఈసారి గతం కంటే భిన్నమైన వ్యూహంతో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని హర్‌కీరత్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీ కొత్తగా 'ఏ స్కేటింగ్ మాంక్' అనే బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది హై-ఎండ్ స్ట్రీట్‌వేర్ బ్రాండ్. ఈ బ్రాండ్ కింద షూష్, చెప్పులు, దుస్తులు, ఇతర పరికరాల ద్వారా యువతను ఆకర్షించే ప్రణాళికను కలిగి ఉన్నామని ఆయన వెల్లడించారు. కంపెనీ వివరాల ప్రకారం, ఉడ్‌ల్యాండ్ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 550 స్టోర్లు ఉన్నాయి.