అజిత్ పవార్ బీజేపీలో చేరితే స్వాగతిస్తాం.. మహారాష్ట్ర మంత్రి

by Harish |
అజిత్ పవార్ బీజేపీలో చేరితే స్వాగతిస్తాం.. మహారాష్ట్ర మంత్రి
X

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని సోమవారం అన్నారు. ఆయనకు రాజకీయాల్లో మంచి అనుభవం ఉందని చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం సీఎం షిండే, డిప్యూటీ ఫడ్నవీస్‌లదేనని తెలిపారు. అజిత్ ఎన్సీపీని వీడి బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి లేకుండా పోయారని రాజకీయ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా దీనిపై పరోక్షంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. పార్టీగా తాము బీజేపీతో చేరమని, అయితే ఎవరైనా నేతలు చేరితే అది వారి వ్యక్తిగతమని చెప్పారు. దీంతో అజిత్ బీజేపీలో చేరుతారనే విషయమై ఇంకా ఉత్కంఠ వీడలేదు.

Advertisement

Next Story