జనవరి 25నే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు ?

by Sumithra |
జనవరి 25నే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు ?
X

దిశ, ఫీచర్స్ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జనవరి 25 వ తేదీన జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారత్ జరుపుకుంటుంది. ఈ రోజున దేశంలోని పౌరులకు ఓటుపట్ల అవగాహన కల్పిస్తారు. అలాగే ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చేసేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఇప్పటి వరకు ఓటు వేయని వారు కూడా ఓటు వేసేలా ఈ రోజు మోటివేట్ చేస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున భారత ఎన్నికల సంఘం అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజే ఎందుకు జరుపుతారు ?

పూర్వం భారత దేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనలో బానిసలుగా ఉన్న భారతీయులు 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత విముక్తులయ్యారు. ఈ తరువాత మూడేండ్లకు అంటే జనవరి 26, 1950 సంవత్సరంలో దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1950 జనవరి 25 వ తేదీన దేశంలో ఎన్నికల సంఘాన్ని స్థాపించారు. అందుకే జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని చేసుకుంటారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఎన్నికల అధికారులు, ప్రభుత్వ అధికారులు శిబిరాలను నిర్వహిస్తారు. కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసి ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలన్నా, నచ్చని నాయకున్ని గద్దెదించాలన్నా ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

ఎప్పుడు ప్రారంభమైంది..

2011లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకునేందుకు జనవరి25 తేదీని ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న జరుపుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed