- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
CPM: వామపక్ష పార్టీలకు భిన్నంగా సీపీఎం.. మోడీపై కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో: వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రధాని నరేంద్రమోడీపై సీపీఎం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం ప్రకటించింది. సీపీఎం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన నోట్‌లో.. బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను ‘‘నియో-ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థ’’గా అభివర్ణించారు. కానీ దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన ఫాసిస్ట్ ప్రభుత్వం అని పిలవమని పేర్కొంది. సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో.. “మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియో- ఫాసిస్ట్ ప్రభుత్వం అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వ పాలనను నియో ఫాసిస్ట్ గా వర్ణించట్లేదు. బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని మాత్రమే చెప్తున్నాం. దీని ఫలితంగా ‘నియో-ఫాసిస్ట్ లక్షణాలు’ మాత్రమే వ్యక్తమయ్యాయని స్పష్టం చేస్తున్నాం.’’ అని పేర్కొనడం సంచలనంగా మారింది.
సీపీఎంపై లెఫ్ట్ పార్టీల విమర్శలు
ఏప్రిల్‌లో తమిళనాడులోని మధురైలో జరిగే 24వ సీపీఎం పార్టీ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఆ సమావేశాలకు ముందు రాష్ట్ర యూనిట్లకు సీపీఎం రాజకీయా తీర్మానాలపై ముసాయిదా నోట్ ని పంపింది. అయితే, సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కుట్రలు కనుమరుగవ్వనున్నాయని కాషాయ పార్టీ పేర్కొంది. మోడీపై నియంత అనే ముద్ర వేసేందుకు జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి శిక్షణ ఇచ్చాడని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, దాని మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు, కేంద్రాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వంగా సీపీఐ పేర్కొనగా.. సీపీఐఎంఎల్ భారత ఫాసిజం అమలవుతోందని విమర్శించింది. కాగా.. ఈ లెఫ్ట్ పార్టీల వైఖరికి భిన్నంగా సీపీఎం వ్యవహరించడం గమనార్హం. కాగా.. సీపీఎం నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. కేరళ ఎన్నికల వేళ బీజేపీతో సీపీఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని మండిపడింది.