- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యేది ఇక్కడే.. కారణం ఏంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం ‘లెసొతో’. ఆఫ్రీకా(Africa)లోని ఈ దేశంలో గ్రామాలు చాలా ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే కాలినడక, గుర్రాలే మార్గం. తెల్లబంగారంగా పిలిచే ఇక్కడి నీటిని సౌతాఫ్రికా(South Africa)కు ఎగుమతి చేస్తారు. ఇక్కడ స్కీయింగ్‌కు బెస్ట్ ప్లేస్. సముద్ర మట్టానికి 3,222 మీటర్ల ఎత్తులో ఉంది. లెవిస్, రాంగ్లర్ బ్రాండ్లకు అవసరమైన జీన్స్ ఇక్కడే కుడతారు. అంతేకాదు అత్యధిక ఆత్మహత్యల రేటు నమోదయ్యేది లేసోతోలోనే. ఈ తరుణంలో ప్రపంచంలో ది మౌంటెన్ కింగ్‌డమ్‌లో ఆత్మహత్యల రేటు కూడా ఎక్కువే.
ఈ క్రమంలో లక్షకు 87.5మంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువ. ఆత్మహత్యల విషయంలో రెండో స్థానంలో ఉన్న ‘గయానా’(Gayana) కంటే కూడా రెట్టింపు. గయానాలో ఆత్మహత్య(Suicide)లు లక్షకు 40గా ఉన్నాయని తేలింది. మాదకద్రవ్యాల వినియోగం(Drug use), ఆల్కహాల్(alcohol), నిరుద్యోగిత(unemployment), మానసిక దౌర్బల్యం(mental illness)తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.
Read Also..
తాగిన మత్తులో కరెంట్ స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్.. చివరికి ఏమైందంటే?