Maharashtra : మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-23 09:42:58.0  )
Maharashtra : మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు ?
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా కూటమి నుంచి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహాయుతికి ప్రజలు తిరిగి పట్టం కట్టినప్పటికి సీఎం కుర్చీ కోసం బీజేపీ, శివసేనల మధ్య పేచి నెలకొంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), శివసేన నుంచి ప్రస్తుం సీఎం ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde)లు ఇద్దరూ కూడా సీఎం రేసులో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈనెల 26తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలిచిన వాళ్లు 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం 220 స్థానాల్లో కూటమిలోని బీజేపీ 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) బీజేపీ తరఫున మహారాష్ట్ర తదుపరి సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా ఫలితాల ప్రక్రియ ముగియ్యక ముందే బీజేపీ నేత ప్రవీణ్‌ దకేకర్‌ కూడా మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీసే బాధ్యతలు చేపడతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్‌ తల్లి సరితా ఫడ్నవీస్‌ కూడా తన కుమారుడే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 25న లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశాన్ని (legislative party Meet) నిర్వహించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పంచాయతీ తేల్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రేపు ముంబైకి కేంద్ర పరిశీలకులను పంపనుంది. వారు కూటమిలోని మూడు పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూల్‌ ఏం లేదు : ఏక్‌నాథ్‌ షిండే

మరోవైపు ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde)నే మహారాష్ట్ర తదుపరి సీఎం అని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈసారి పెద్ద పార్టీ అయిన బీజేపీ సీఎం పదవి చేపడుతుందా..? అని మీడియా ప్రశ్నించగా ‘కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూల్‌ ఏం లేదుగా..!’ అని షిండే వ్యాఖ్యానించారు. మళ్లీ సీఎం మీరే అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కూటమిలోని మూడు పార్టీల నేతలం కూర్చుని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో సీఎం సీటు ఎవరికన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికే మళ్లీ పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలకు షిండే కృతజ్ఞతలు తెలిపారు.


Read More..

Eknath Shinde: సీఎం ఎవరనేది త్వరలోనే తెలుస్తోంది: ఏక్ నాథ్ షిండే

Advertisement

Next Story

Most Viewed