BBC ఇష్యూ: ఐటీ సర్వే( IT Survey) అంటే ఏంటో తెలుసా? IT సర్వే, IT సోదాలు, IT రైడ్స్కు మధ్య తేడా ఏంటీ?

by Javid Pasha |   ( Updated:2023-02-15 17:12:26.0  )
BBC ఇష్యూ: ఐటీ సర్వే( IT Survey) అంటే ఏంటో తెలుసా? IT సర్వే, IT సోదాలు, IT రైడ్స్కు మధ్య తేడా ఏంటీ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై ''ఇండియా: ది మోడీ క్వశ్చన్'' పేరుతో BBC ఛానెల్ ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్ లో జరిగినో గోద్రా అలర్లలో అప్పడు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత పీఎం మోడీ పాత్ర ఉందంటూ BBC ఆరోపించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. BBC ప్రసారం చేసిన ఈ వీడియోను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే BBCని భారత్ లో బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే సదరు ఛానెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దేశ సర్వోన్నత న్యాయ స్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని Income Tax అధికారులు భారత్ లోని BBC సంస్థ కార్యాలయాలపై దాడులు జరిపారు. ఢిల్లీ, ముంబై లోని BBC కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు జరపడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మీడియా గొంతు నొక్కుతున్నారని ప్రధాని మోడీపై ప్రతిపక్షాల నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు తాము రైడ్స్ చేయలేదని, సర్వే మాత్రమే చేశామని స్పష్టం చేశారు. దీంతో ఐటీ సర్వే, ఐటీ రైడ్స్, ఐటీ సోదాలకు మధ్య తేడా ఏంటనే చర్చ మీడియాలో జోరుగా నడుస్తోంది.

అసలు ఇన్కం ట్యాక్స్ (IT) సర్వే అంటే ఏంటి?

పన్ను ఎగవేతదారులను కనిపెట్టడానికి మామూలుగా ఈ (Income Tax) సర్వే చేపడతారు. పన్ను ఎగవేతదారుల వద్దకు వెళ్లి పన్ను కట్టించడం, జాప్యానికి ఎక్స్ ట్రా ఫీజు లేదా వడ్డీ కట్టించుకోవడం వంటివి (IT) సర్వేలో భాగంగా ఉంటాయి. పన్ను ఎగవేత దారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా (IT) సర్వేను నిర్వహించవచ్చు. ఈ క్రమంలోనే వ్యక్తి లేదా సంస్థ యొక్క రికార్డులను, అకౌంట్లను పరిశీలించే అధికారం (IT) సర్వే అధికారలకు ఉంటుంది. కానీ (IT) దాడులు లేదా సోదాలు చేయాలంటే మాత్రం పన్ను ఎగవేతకు సంబంధించిన కచ్చితమైన ఆధారం ఉండాలి.

ఇన్ కం ట్యాక్స్ చట్టం ఏం చెబుతోందంటే..?

(IT) సర్వే చేసేందుకు అధికారులు తమకు కేటాయించిన పరిధిలోని వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన స్థలాల్లో ప్రవేశించవచ్చని ఐటీ చట్టం చెబుతోంది. ఐటీ సర్వేలో భాగంగా ఐటీ అధికారులు సదరు వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఎవరైనా వ్యక్తి ఆధ్వర్యంలో అకౌంట్స్, బుక్స్ పరిశీలించాలి. ఈ క్రమంలో ఆ స్థలంలో ఉన్న క్యాష్, స్టాక్, ఇతర వస్తువులేవైనా సరే ఐటీ అధికారుల పరిశీలించవచ్చు. సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచి ఎలాంటి సమాచారాన్నైనా అడిగే అధికారం ఈ చట్టం ప్రకారం అధికారులకు ఉంటుంది. కానీ ఐటీ దాడులు, సోదాల సమయంలో పన్ను ఎగవేత సంస్థలతో పాటు ఆ సంస్థకు చెందిన అధికారులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులపై కూడా దాడులు చేయవచ్చు.

ఏ ఏ సమయాల్లో ఐటీ అధికారులు సదరు సంస్థల్లో ప్రవేశించవచ్చు?

ఐటీ సర్వే చేయడానికి తన కార్యకలాపాల నిమిత్తం బిజినెస్ సంస్థ ఓపెన్ అయ్యాకే అధికారులు ప్రవేశించాలి. ఇంకా వేరే సంస్థలు లేదా వ్యక్తులు అయితే మాత్రం సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మాత్రమే సర్వే చేయాలి. కానీ ఐటీ సోదాలు చేయాలనుకుంటే మాత్రం సూర్యోదయం తర్వాత ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు. అలాగే ఐటీ దాడులు చేసే అధికారులు ఏ సమయంలోనైనా సదరు సంస్థ లేదా వ్యక్తుల ఆస్తులపై దాడులు నిర్వహించవచ్చు. సర్వే సమయంలో ఐటీ అధికారులు సంస్థలకు సంబంధించిన రికార్డ్స్, డాక్యుమెంట్స్ పై ఆనవాళ్ల కోసం ఏవైనా గుర్తులు పెట్టవచ్చు.

సర్వే సమయంలో ఏవైనా వస్తువులను సీజ్ చేయవచ్చా?

సర్వే స్థలంలో నుంచి ఎలాంటి వస్తువులను సీజ్ చేసే అధికారం సర్వే చేస్తున్న ఐటీ అధికారులకు లేదు. కాకపోతే ఏదైనా డాక్యుమెంట్ ను సీజ్ చేయాలన్నా లేక తమతో తీసుకుపోవాలంటే మాత్రం కారణాలను కచ్చితంగా రికార్డ్ చేయాల్సిందే. కానీ సోదాలు, దాడుల సమయంలో ఏ వస్తువునైనా సీజ్ చేసే అధికారంల అధికారులకు ఉంటుంది.

సర్వే సమయంలో స్టేట్ మెంట్స్ రికార్డ్ చేయవచ్చా?

సర్వే సమయంలో ఐటీ అధికారులు కావాలనుకుంటే వ్యక్తల స్టేట్ మెంట్స్ ను రికార్డ్ చేయవచ్చు. కానీ వాటి ఆధారంగా సదరు వ్యక్తులపై యాక్షన్ తీసుకునే అధికారం మాత్రం లేదు. కానీ సోదాలు, దాడుల సమయంలో.. వ్యక్తుల స్టేట్ మెంట్స్ ను రికార్డ్ చేసే అధికారం ఉంటుంది. సీబీఐ లేదా స్టేట్ పోలీసులకు రైడ్స్, సోదాలు చేసే సమయంలో అరెస్ట్ చేసే అధికారం కూడా కలదు.

డబ్బు, విలువైన వస్తువులను సీజ్ చేయవచ్చా?

ఐటీ సర్వే సమయంలో ఐటీ అధికారులకు డబ్బు, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసే అధికారం లేదు. కానీ రైడ్స్, సోదాల సమయంలో మాత్రం చేయవచ్చు.

Advertisement

Next Story