- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Methanol: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిథనాల్ పాలసీ ఏమైంది? ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రూ. 22 కే లీటర్ పెట్రోల్?

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు రోజు రోజుకు ఎలా పెరుగుతున్నాయో .. పెట్రోల్ ధరలు ( petrol rates ) కూడా కొండెక్కుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప, తగ్గడం లేదు. ఒక వేళ కొంచం తగ్గించిన మళ్లీ నెలకు అమాంతం పెంచుతున్నారు. దీంతో, వాహనదారులు ఇంత రేట్లు పెంచితే మేము మా బండ్లను నడపాలా ? వద్దా అంటూ మండిపడుతున్నారు. అయితే, గతంలో పెట్రోల్‌ను రూ.22కే అందిస్తామని ప్రకటించారు. కానీ, ఇంత వరకు మన ముందుకు రాలేదు. అప్పట్లో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మరొక ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దాని పేరే మిథనాల్. అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే, పెరుగుతున్న పెట్రోల్ ధరల వలన మరోసారి మిథనాల్ పేరు బాగా వినబడుతోంది. దీన్ని కేవలం రూ.22 కే లీటర్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం మిథనాల్ పాలసీని ( methanol policy) ప్రకటించింది. అయితే, ఈ ప్రాజెక్టు మన ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు. బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని 15 శాత పెట్రోల్‌లో కలుపుతారు. దీంతో, మిథనాల్ ఇంధనం తయారవుతుంది. ఇక, ఇలా తయారు చేసిన ఇంధనం ధర లీటర్ రూ.22 మాత్రమే. చైనాలో రూ.17కే ఈ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. అయితే, మన దేశంలో కూడా మిథనాల్‌ను తయారు చేసి అందిస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్ల దెబ్బకు ప్రజలు ఫైర్ అవుతున్నారు.
భారత దేశంలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ( RCF), ముంబైలో ఉన్న కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే, స్వీడన్ ఆటో మేజర్ వోల్వో కంపెనీ మిథనాల్‌తో నడిచే ఇంజిన్‌ను కూడా తయారు చేసింది. దీంతో, వాహనాలను సులభంగా నడిపించవచ్చు. అయితే, ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ, ఇది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా మిథనాల్‌ను తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.