చంపాల్సింది పేదరికాన్ని.. పేదలను కాదు: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్

by Javid Pasha |   ( Updated:2023-07-08 16:11:46.0  )
చంపాల్సింది పేదరికాన్ని.. పేదలను కాదు: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్
X

దిశ, వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా బెంగాల్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై అక్కడి గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అలర్లలో పలువురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఉన్నది పేదరికాన్ని చంపడానికే తప్ప పేదలను చంపడానికి కాదని పరోక్షంగా మమతా ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్ లో జరిగిన తాజా అల్లర్లలో చనిపోయింది పేదలే అన్న గవర్నర్.. చంపింది కూడా పేదలేనని అన్నారు.

బెంగాల్ కోరుకున్నది ఇది కాదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాలు చేయడం లేదని, బెంగాల్ లో శాంతిని కోరుతున్నానని అన్నారు. హింస ఎవరు చేసినా తప్పేనని అన్నారు. బెంగాల్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా గత కొన్ని రోజులుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అక్కడి గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed