Encounter : మరో ఎన్‌కౌంటర్.. కాంట్రాక్ట్ కిల్లర్ పంకజ్ యాదవ్ హతం

by Hajipasha |
Encounter : మరో ఎన్‌కౌంటర్.. కాంట్రాక్ట్ కిల్లర్ పంకజ్ యాదవ్ హతం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. కాంట్రాక్ట్ కిల్లర్ పంకజ్ యాదవ్‌ను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం తెల్లవారుజామున 5.20 గంటలకు మధుర జిల్లాలోని ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ అనంతరం హుటాహుటిన పంకజ్ యాదవ్‌‌ను ఆస్పత్రికి తరలించారు.

అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. సంఘటనా స్థలం నుంచి పిస్టోల్, రివాల్వర్, టూ వీలర్, కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి పంకజ్ యాదవ్‌ సహచరుడు ఒకరు తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. పంకజ్‌కు ముఖ్తార్ అన్సారీ, మహ్మద్ షహబుద్దీన్ గ్యాంగ్‌లతో సంబంధం ఉండేదని చెప్పారు. అతడి తలపై 1 లక్ష పోలీసు రివార్డు ఉందన్నారు.

Advertisement

Next Story