- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనారిటీ ఓట్ల కోసమే సీఏఏ రద్దు చేయాలంటున్నారు: చిదంబరంపై అమిత్ షా ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీ ఓట్లను పొందేందుకు మాత్రమే సీఏఏ రద్దు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ‘1960ల నుంచి ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను ఆయుధంగా మార్చుకుంది. దీనికి వ్యతిరేకంగా అనేక ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. 2014 నుంచి మోడీ ప్రజల ఎజెండాను రూపొందించారు. అభివృద్ధి చూపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయలేకనే బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. చిదంబరం ఆశయాలు ఎప్పటికీ ఫలించబోవని ఎద్దేవా చేశారు.
సీఏఏ వల్ల ఎవరి పౌరసత్వం రద్దు కాదని, దీనిపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్ధం కావడం లేదని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎన్డీయే తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలతో పాటు సీఏఏను రద్దు చేస్తుందన్నారు. కానీ వీటి వల్ల ప్రతి పౌరుడికీ న్యాయం జరుగుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతి శరణార్థికి పౌరసత్వం లభిస్తుందని నొక్కి చెప్పారు. బీజేపీ తన సిద్దాంతాల పట్ల దృఢంగా ఉందని, ఎవరికీ అన్యాయం చేయబోదని తెలిపారు.