వినేశ్ ఫొగట్‌పై కుట్ర జరిగింది.. విజేందర్ సింగ్ అనుమానం

by Gantepaka Srikanth |
వినేశ్ ఫొగట్‌పై కుట్ర జరిగింది.. విజేందర్ సింగ్ అనుమానం
X

దిశ, వెబ్‌డెస్క్: వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు వేయడంపై ఇండియన్ బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఏదో కుట్ర కచ్చితంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. పెరిగిన ఆ 100 గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలంపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటిది గతంలో తానేప్పుడూ చూడలేదని.. భారత రెజ్లర్లపై ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. బహుశా మన సంతోషాన్ని చూడలేని వారు ఈ పన్నాగానికి పాల్పడ్డారేమో అనిపిస్తోందని తెలిపారు. ఒక్కోసారి రాత్రికి రాత్రే ఐదారు కిలోలు తగ్గుతుంటాం. 100 గ్రాములు తగ్గడం పెద్ద సమస్య కాదు. తప్పకుండా అనుమానించాల్సిందే అని పేర్కొన్నారు. కాగా, 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు ఉండటంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story