యూపీ మదర్సా విద్యా చట్టాన్ని కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

by S Gopi |
యూపీ మదర్సా విద్యా చట్టాన్ని కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులను వెలువరించింది. 2004 నాటి యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా విద్యా చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, దాన్ని కొట్టివేసింది. ఇది లౌకిక స్దిద్ధాంతాన్ని ఉల్లంఘించిందని చెబుతూ, న్యాయమూర్తులు వివేక్ చౌదరీ, సుభాష్ విద్యార్థితో కూడిన డివిజన్ బెంచ్ ప్రస్తుతం మదర్సాల్లో ఉన్న విద్యార్థులను అధికారిక విద్యా విధానంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఇస్లామిక్ విద్యా సంస్థలపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నెల రోజుల తర్వాత హైకోర్టు తీర్పు వెలువడం గమనార్హం. ఇదే సమయంలో విదేశాల నుంచి మదర్సాలకు వచ్చే నిధులపై దర్యాప్తు చేపట్టడానికి గతేడాది యూపీ ప్రభుత్వం సిత్‌ను ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed