- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైళ్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి భోపాల్‌కు రైలులో ప్రయాణించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన భార్యతో కలిసి ఢిల్లీ నుండి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన రైలులోని ప్రయాణికులతో మాట్లాడారు, పిల్లలను ఎత్తుకున్నారు, కొందరు ఆయనతో సెల్ఫీలు కూడా దిగారు. మార్గ మధ్యలో మోరెనా స్టేషన్‌లో మద్దతుదారులను కలుసుకున్నారు. ఎక్స్‌లో తన ప్రయాణ విషయాలను పంచుకున్న చౌహాన్, భారతీయ రైల్వేలలో "విప్లవాత్మక మార్పులకు" ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ప్రశంసించారు.
నేను న్యూఢిల్లీ నుండి 'శతాబ్ది ఎక్స్‌ప్రెస్' రైలులో ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణ అనుభవం చాలా ఆనందదాయకంగా ఉంది. గౌరవనీయ ప్రధాన మంత్రి మోడీ గారి మార్గదర్శకత్వంలో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దార్శనికతతో, భారతీయ రైల్వేల నిర్వహణ, కార్యకలాపాలకు చెందిన అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, వారి ప్రయాణాన్ని పొదుపుగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2024 లోక్‌సభ ఎన్నికలలో చౌహాన్ విదిశ కోట నుండి పోటీ చేసి గెలిచారు. కానీ ఈ సారి రాష్ట్ర సీఎంగా కాకుండా కేంద్ర మంత్రి వర్గంలో వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.