- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uddhav: ఫలితాలను నమ్మలేకపోతున్నా.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్‌పై శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే (Udhav thakrey) స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సునామీ లాంటివని, దీనిని ఎవరూ ఊహించలేదని తెలిపారు. ఫలితాలను నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఓట్ల సునామీకి అర్హులైనంతగా మహాయుతి కూటమి ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వారు ఏం చేశారో అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ఎన్డీఏ పరిష్కరించలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) భారీ షాక్ ఇచ్చిందని, నాలుగు నెలల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఎలా మారగలదని ప్రశ్నించారు. రైతులు అనేక బాధలు పడుతున్నారని, నిరుద్యోగం పెరిగిపోయిందని అయినప్పటికీ ఈ రకమైన ఓట్ల సునామీ రావడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.
విజయం సాధించినందుకు మహాయుతి కూటమికి అభినందనలు తెలిపారు. లడ్కీ బహిన్ యోజన సక్రమంగా అమలు చేయబడుతుందని, అది కేవలం ఎన్నికల జుమ్లా హామీగా మారదని భావిస్తున్నానన్నారు. రైతుల సమస్యలు తీర్చుతారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘కొవిడ్ 19 సమయంలో మహారాష్ట్ర కుటుంబ పెద్దగా నాకు అండగా నిలింది. ఎల్లవేళలా నా ఆదేశాలను పాటించింది. కానీ అదే రాష్ట్ర ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం నేను నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు. శివసేన గుర్తు, పేరు వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయానికి ముందే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.