రాష్ట్రంలో త్వరలోనే యూసీసీ అమలు: ఉత్తరాఖండ్ సీఎం

by samatah |
రాష్ట్రంలో త్వరలోనే యూసీసీ అమలు: ఉత్తరాఖండ్ సీఎం
X

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో త్వరలోనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. దీని అమలుకు సంబంధించిన బిల్లును తొందర్లోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. బృందావన్‌లోని వాత్సల్య గ్రామ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధామి.. యూసీసీ అనేది అన్ని మతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రామభక్తులపై కాల్పులు జరిపిన వ్యక్తులు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిచలేదని చెప్పారు. రామజన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం జనవరి 22నాటికి నెరవేరుతుందన్నారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో సాధ్వి ఋతంభర చేసిన ఉపన్యాసాల ద్వారా తాను ప్రేరణ పొందినట్టు తెలిపారు.


Advertisement
Next Story

Most Viewed