Eknath Shinde: మహా సీఎం ఎవరనే దానిపై వీడని సస్పెన్స్.. మహాయుతి కీలక భేటీ రద్దు

by Shamantha N |
Eknath Shinde: మహా సీఎం ఎవరనే దానిపై వీడని సస్పెన్స్.. మహాయుతి కీలక భేటీ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో (Maharashtra) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సీఎం పదవిపై సస్పెన్స్ వీడలేదు. సీఎం పదవి కోసం చర్చలు జరుగుతుండగా.. శుక్రవారం ముంబైలో జరగాల్సిన కీలక సమావేశం రద్దు అయినట్లు తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన భేటీ గురించి చర్చించేందుకు ముంబైలో కూటమి సమావేశం జరగాల్సి ఉంది. ఇప్పుడు అది రద్దయిందని తెలుస్తోంది. అలానే శివసేన పార్టీ సమావేశం కూడా రద్దు అయినట్లు సమాచారం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde cancels Meeting) తన స్వగ్రామం సతారాకు వెళ్లారని, అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సమావేశాలు జరగొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అమిత్ షాతో భేటీ

గురువారం, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మహాయుతి నేతలు ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde), దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌పవార్‌ సమావేశమయ్యారు. ‘‘మహారాష్ట్ర సీఎం పదవి (Maharashtra CM Post)పై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయి. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం’’ అని షిండే (Eknath Shinde) వెల్లడించారు. మరోవైపు, ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి రేసులో ముందున్నా మరో ఆలోచన పైనా బీజేపీ అధిష్ఠానం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను కాషాయపార్టీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ షిండే తిరస్కరించారని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. కేబినేట్ లో ఆయన భాగంగా ఉండాలని, అయితే సీఎంగా చేసి మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఎలా చేయగలరని శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ సిర్సాత్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed