- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Donald Trump : జిన్‌పింగ్‌కు ట్రంప్ ఫోన్‌కాల్.. చర్చించిన అంశాలివే..!

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్ కాల్ చేశారు. ఇద్దరు నేతలు వాణిజ్య అంశాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్‌టాక్‌పై చర్చించారు. ఈ మేరకు వివరాలను ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మా మధ్య చైనా- అమెరికాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇరు దేశాలు త్వరలోనే పలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నా. వాణిజ్య అంశాలతో పాటు టిక్‌టాక్‌పై చర్చించాం.’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇద్దరు నేతలు ఫోన్ కాల్‌లో సంభాషించుకున్నట్లు చైనా మీడియా ధ్రువీకరించింది. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్ పింగ్ హాజరు కావడం లేదని ఇప్పటికే చైనా ప్రకటించింది. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ హన్ జెంగ్‌ను ప్రత్యేక రిప్రజెంటేటివ్‌గా చైనా నియమించింది. ‘కొత్తగా కొలువు దీరే యూఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. విభేదాలు ఉన్నా ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తాయి. చైనా-అమెరికా మధ్య సుస్థిర సంబంధాలు కొనసాగుతాయి’ అని చైనా విదేశాంగ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.