- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Donald Trump: ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉంది

దిశ, నేషనల్ బ్యూరో: తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia Ukraine war) 24 గంటల్లోనే ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్(Trump) వ్యాఖ్యలు చేశారు. కాగా.. ప్రస్తుతం ఆ కామెంట్లపై ఆయన స్పందించారు. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉందని అంగీకరించారు. అయితే యుద్ధ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నానని, ఆ దిశగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. "నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను ఆ యుద్ధాన్ని పరిష్కరించాలనుకుంటున్నా. అందులో విజయం సాధిస్తానని అనుకుంటున్నాను. కాగా.. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోతే ఏంటనే ప్రశ్నపైనా ట్రంప్ స్పందించారు. ప్రపంచానికే ఇదో బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. కానీ, కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తాడని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పుతిన్ గురించి తనకు తెలుసని.. కచ్చితంగా ఒప్పుకుంటాడని చెప్పుకొచ్చారు.
మాస్కోకు ట్రంప్ ప్రత్యేక సలహాదారు
మరోవైపు ట్రంప్ ప్రత్యేక సలహాదారు స్టీవ్ విట్‌కాఫ్ ఈ వారం మాస్కోకు వెళ్లారు. అమెరికా ప్రతిపాదిత కాల్పుల విరమణపై చర్చలు జరిపారు. ఈ విషయంపై ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించింది. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి 'గొప్ప లక్ష్యం' వహించినందుకు మోడీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read..
Starmer: పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలి.. గ్లోబర్ లీడర్స్‌కు బ్రిటన్ పీఎం స్టార్మర్ విజ్ఞప్తి
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలపై దేశాలపై ట్రావెల్ బ్యాన్