Donald Trump: ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ట్రంప్ ఇంటర్వ్యూలు

by Shamantha N |
Donald Trump: ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ట్రంప్ ఇంటర్వ్యూలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌ బాధ్యతల నుంచి క్రిస్టోఫర్‌ వ్రే (Christopher Wray)ను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఆ పదవి కోసం ఇంటర్వ్యూలు కూడా కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ట్రంప్‌ రన్నింగ్‌మేట్‌, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్‌ (JD Vance) ఓ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. అయితే, వెంటనే ఆ పోస్టును డిలీట్‌ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌తో సహా మా ప్రభుత్వం కోసం అనేక స్థానాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం’ అని వాన్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తరువాత ఆ పోస్టును తొలగించారు. ఇక, గతంలోనూ పవర్ ఫుల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కావాలంటూ వాన్స్ పిలుపునిచ్చారు.

ట్రంప్ పై కార్యవర్గ విస్తరణ..

ఇకపోతే, ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్‌ వ్రేను ట్రంప్‌ ఇంటికి పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎఫ్‌బీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ‘ట్రంప్‌ తన కార్యవర్గంలో ఎవరు పనిచేయాలనే దానిపై ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలను ఆయనే స్వయంగా ప్రకటిస్తారు’ అని ట్రంప్‌ ట్రాన్సిషన్ టీమ్‌ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, ట్రంప్‌ తన కార్యవర్గ విస్తరణలో భాగంగా ప్రపంచ కుబేరుడు ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ అయిన లిండా మెక్‌మాన్‌ (Linda McMahon)ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. మెక్‌మాన్ 2009 నుంచి కనెక్టికట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో పనిచేశారు. ఆ తరువాత ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు కొంతకాలం నాయకత్వం వహించారు.

Advertisement

Next Story