- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నెలల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష
దిశ, నేషనల్ బ్యూరో: మూడు నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో ట్రాన్స్ జెండర్ కు మరణసిక్ష విధించింది ముంబై కోర్టు. ఇలాంటి నేరాల వల్ల సమాజం రూపురేఖలు పాడైపోతున్నాయని వ్యాఖ్యానించారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అదితీ కదమ్. ఈ కేసులో సహేతుకమైన కారణాలు లేనందున మరో నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు.
జులై 2021లో 24 ఏళ్ల నిందితుడు సమీపంలోని ఇంట్లో నివసించే బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశాడు. కొవిడ్ కారణంగా బిడ్డ పుట్టిన తర్వాత బాధితురాలి కుటుంబం నిందితుడికి బహుమతి అందించలేదు. ఆ పగతోనే బాలికపై దారుణ చర్యకు పాల్పడ్డారని తెలిపారు జస్టిస్ అదితీ కదమ్. అతనికి బహుమతులు ఇవ్వడానికి ఎవరూ నిరాకరించకూడదని.. పరిసరాల్లో భయాందోళనలు సృష్టించడమే నిందితుడి ఉద్దేశమని తెలిపారు.
ఆడపిల్లల భద్రత సమాజానికి అత్యంత ముఖ్యమైనదని తెలిపారు న్యాయమూర్తి. నిందితులు నేరం చేయాలని ప్లాన్ చేసి, దానిని నిశితంగా అమలు చేశాడని గమినించామన్నారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు డెడ్ బాడీని చిత్తడి ప్రదేశంలో పాతిపెట్టాడని అన్నారు. ఈ ఘటనను అనాగరిక, అమానవీయమైన నేరంగా పరిగణించామన్నారు జస్టిస్ అదితీ కదమ్. దీన్ని అరుదైన కేసుగా భావించామన్నారు. నిందితుడిలో పశ్చాత్తాపం లేదని.. అలాంటి వారిపై సానుభూతి చూపడానికి ఎలాంటి ఆస్కారం లేదని తెలిపారు.