యూపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం.. తల్లీకూతుళ్ల మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-14 06:33:48.0  )
యూపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం.. తల్లీకూతుళ్ల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలోని డెహట్ జిల్లా కాన్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా 45 ఏళ్ల మహిళ, ఆమె 20 ఏళ్ల కూతురు మరణించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు స్పందిస్తూ.. తల్లీ కూతుళ్లు గుడిసెలో ఉండగానే పోలీసులు నిప్పు పెట్టారని ఆరోపించారు. కాగా పోలీసులు మాత్రం ఇద్దరు మహిళలు తమకు తాముగానే నిప్పు పెట్టుకున్నారని తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుల్లో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు. వారిపై హత్యాయత్నం, స్వచ్ఛందంగా గాయపరిచారనే అభియోగాలను పోలీసులు మోపారు. రూరా ఏరియాలోని మడౌలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గ్రామంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు.

సరైన నోటీసులు జారీ చేయకుండానే అధికారులు బుల్డోజర్ తో ఉదయం గ్రామానికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళలు గుడిసెలో ఉండగానే నిప్పు పెట్టినట్లు వారు ఆరోపించారు. అప్రమత్తమైన తాము వెంటనే తప్పించుకున్నట్లు తెలిపారు. అధికారులు తమ గ్రామంలోని గుడిని ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ తల్లిని ఎవరూ కాపాడలేకపోయారని శివమ్ దిక్షిత్ తెలిపింది. అందరూ పారిపోయారని పేర్కొంది. లోకల్ పోలీసులు మాత్రం ప్రమీలా దిక్షిత్, ఆమె కూతురి నెహా తమకు తాము నిప్పంటిచుకున్నారని తెలిపారు. అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా వీడియో తీశామని వీడియో ఆధారంగా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed