ట్రాఫిక్​ సిగ్నల్స్​ రెడ్​, గ్రీన్‌లోనే​ ఎందుకు?

by HARISH SP |
ట్రాఫిక్​ సిగ్నల్స్​ రెడ్​, గ్రీన్‌లోనే​ ఎందుకు?
X

ట్రాఫిక్​ కష్టాలు ఎలా ఉంటాయో నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 20కిలోమీటర్లు ప్రయాణించాలంటే పీక్​ టైమ్​లో ఈజీగా గంటన్నర టైమ్​ పడుతున్నది. ఇలా ఎంతోసేపు ట్రాఫిక్​లో ఇరుక్కున్నవాళ్ల అందరిచూపు సిగ్నళ్లపైనే ఉంటుంది. రెడ్​ లైట్​ పోయి గ్రీన్​ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. మరి ట్రాఫిక్​ సిగ్నళ్లు రెడ్​, యెల్లో, గ్రీన్​ కలర్స్​లోనే ఎందుకు ఉండాలి. ఇంకే కలర్స్​లో ఎందుకు ఉండవు? అనే ఆలోచన వచ్చిందా? ఒకవేళ రాకపోయినా? ఇప్పుడు అవును కదా? అనుకుంటున్నారా? ఆ సంగతులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దూరం నుంచి కూడా కనిపించడం..

ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఈ రంగులు మిగితా రంగుల కంటే దూరంలో ఉన్నవాళ్లకు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పొగమంచు, రాత్రి, పగలు సమయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగులను ఎంపిక చేశారు.

కలర్​ బ్లైండ్​నెస్ ఉన్నా..

ఈ మూడు రంగులు కలర్​ బ్లైండ్​నెస్​ (వర్ణ అంధత్వం) ఉన్నవారికి కూడా కనిపిస్తాయి. అందువల్ల ఈ మూడు రంగుల ఎంపికకు ఇది కూడా ఒక కారణం. దూరం నుంచి కనిపించడంతోపాటు వర్ణ అంధత్వం ఉన్న వ్యక్తులు కూడా చూసే అవకాశం ఉండటం వల్ల ఈ రంగులు ఎంపిక అయ్యాయి.

మానసిక స్థితిపై ప్రభావం

మానవ మానసిక స్థితి కూడా ఎరుపు రంగు ప్రమాదానికి గుర్తుగా భావిస్తుంది. అదేసమయంలో ఆకుపచ్చ ప్రకృతికి ప్రతిరూపంగా.. పసుపు సంతోషానికి, సూర్యుడికి ప్రతీకగా భావించడం కూడా ఈ రంగుల ఎంపికకు ఒక కారణమైంది.




ఎక్కడ మొదలైంది?

లండన్​లో 1868 ఏడాదికి కాస్త అటుఇటుగా ట్రాఫిక్​ సిగ్నళ్లను ప్రారంభించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు లాంతర్లను ఉపయోగించి.. ట్రాఫిక్​ క్రమబద్దీకరించేవారు. కూడళ్ల వద్ద పోలీస్​ కానిస్టేబుల్​ రెడ్​, గ్రీన్​ రంగు అద్దాలు ఉన్న లాంతర్లను చేతితో పట్టుకునేవాడు. అయితే, ఒకటీ రెండేళ్లకు ఒక లాంతర్​ పేలడం వల్ల పోలీసుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. 1920లో విలియం పాట్స్​ అనే పోలీసు అధికారి రెడ్​, గ్రీన్​తోపాటు యెల్లో కలర్​ కూడా ఉండాలని సూత్రీకరించాడు. రెడ్​ కలర్​ పడితే వాహనాలు ఆగాలని.. గ్రీన్​ అంటే వాహనాలు ముందుకు కదలాలని.. యెల్లో లైట్​ ఉంటే ఎదురుగా ఎలాంటి వాహనాలు లేవనే నమ్మకం కలిగితే ముందుకు కదలాలని నిర్ణయించాడు. దీనికి పౌరవ్యవస్థలతోపాటు ప్రభుత్వాల ఆమోదం లభించింది. ఈ మూడు లైట్ల వ్యవస్థను అమెరికాలోని డెట్రాయిట్​, మిచిగాన్​లో ముందుగా ప్రారంభించారు. అదే సమయంలో 1920లో ఆఫ్రికా మూలాలు ఉన్న అమెరిక పౌరుడు గారెట్​ మోర్గాన్​ ఎలక్ట్రిక్​ ట్రాఫిక్​ లైట్​ వ్యవస్థను ఆవిష్కరించాడు. దీనికి పేటెంట్​ కూడా పొందాడు. ఆ వెంటనే దీనిని రైల్వేలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్​ లైట్​ వ్యవస్థకు ఆద్యుడు మోర్గానే.

Advertisement

Next Story

Most Viewed