Kargil Vijay Diwas : నేడు కార్గిల్ విజయ్ దివస్.. కీలక ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by Sathputhe Rajesh |
Kargil Vijay Diwas : నేడు కార్గిల్ విజయ్ దివస్.. కీలక ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్ జరగనుంది. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీంతో ఇవాళ దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.20 గంటలకు ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. అక్కడ కార్గిల్ యుద్ధ వీరులకు మోడీ నివాళులర్పించనున్నారు. షిన్‌కున్‌లా సొరంగం పనులను వర్చువల్‌గా మోడీ ప్రారంభించనున్నారు. ఇది లెహ్‌కు కనెక్టివిటీని పెంచే ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉంది. నిము-పాడుమ్-దర్చా రహదారిపై 15,800 అడుగుల ఎత్తులో సొరంగం ఉంది. 4.1 కిలోమీటర్ల ట్విన్ ట్యూబ్ సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతికూల పరిస్థితుల్లోనూ లెహ్‌కు చేరుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సొరంగంగా రికార్డులోకి ఎక్కనుంది.



Next Story

Most Viewed