- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TMC: శ్వేతపత్రం విడుదలను డిమాండ్‌పైనే టీఎంసీ వాకౌట్: ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ
దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని తమ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారని, అందులో భాగంగానే మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తెలిపారు. అభిషేక్ బెనర్జీ స్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టంగా పేర్కొనడం మూలంగానే వాకౌట్ చేశాం. మా రాష్ట్రానికి చెందిన ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఆవాస్ యోజన పథకాల కేటాయింపులను ప్రకటించాలని కోరాం. తమ నేతలు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులివ్వకుండా తప్పించుకున్నారు. నిధులు కేటాయించిన ప్రాజెక్టుల జాబితాను మాత్రమే ఆమె చెప్పారు. కానీ, మేము అడిగిన వివరాలు ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్‌కు బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సైతం ప్రశ్నించారు. 'ఏ రాజకీయ నేతలైనా ప్రకటనలు చేస్తారు. అది సరైనదా అనేదానితో సంబంధం లేదు. కానీ పేపర్లు ఎప్పుడూ అబద్దం చెప్పవు. 2021లో బెంగాల్‌లో ఓటమిని ఎదుర్కొన్నప్పటి నుంచి బీజేపీ రాష్ట్రానికి కేటాయింపులు చేయలేదు. బెంగాల్‌కు 100 రోజుల వేతన ఉపాధి, గృహ నిర్మాణ పథకం కోసం రాష్టం నుంచి ఇళ్లు పొందిన 11.36 లక్షల మంది జాబితా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దానికి సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా నిధులు కేటాయిస్తే, స్వేతపత్రం విడుదల చేసి నిజానిజాలను వెల్లడించాలని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి, మిగిలిన మంత్రులను కోరుతున్నట్టు ' అభిషేక్ బెనర్జీ విలేకరులతో మాట్లాడారు.