- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Threatening Call: ప్రధాని మోడీ లక్ష్యంగా బెదిరింపు కాల్.. పోలీసుల అదుపులో నిందితుడు

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విదేశీ పర్యటన నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 11న ప్రధాని మోదీ ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరుగుతుందని ఓ దుండగుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ (Mumbai Police Control Room)కు కాల్ చేశాడు. అధికారిక పర్యటన కోసం విదేశాలకు బయలుదేరుతున్నందున ఉగ్రవాదులు ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రయాణించే విమానాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అతడు హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వచ్చిన కాల్ ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. మహారాష్ట్ర (Maharashtra)లోని చెంబూరు (Chemburu) ప్రాంతానికి చెందిన వ్యక్తి ముంబాయ్ పోలీస్ కంట్రోల్ రూమ్ (Mumbai Police Control Room)కు కాల్ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫోన్ చేసిన వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించారు. కాగా, నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్ (France), అమెరికా (America) పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సోమవారం దేశ రాజధాని నుంచి బయలుదేరారు. మంగళవారం పారిస్ (Paris)లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ (Artificial Intelligence Action Summit)కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron)తో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు.