- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ కరాచీ వరకు వెళ్లాడనకున్నా.. జోడో యాత్రపై రక్షణ మంత్రి సెటైర్లు
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్‌పై విమర్శనస్త్రాలు సంధించారు. జోడో యాత్ర చేసుకుంటూ రాహుల్ కరాచీ వరకు వెళ్తారని తాను భావించినట్లు సెటైర్లు వేశారు. గురవారం కర్ణాటక నందగాడ్‌లో విజయ్ సంకల్ప్ యాత్ర రెండో భాగాన్ని ఆయన ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ తో అధికారంలోకి వచ్చేలా మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. భారత్ 1947లో విడిపోయిందని.. జోడో యాత్రలో భాగంగా రాహుల్ కరాచీ వెళ్తారని భావించినట్లు సెటైర్లు వేశారు.
దేశమంతా ఐక్యంగా ఉంటే రాహుల్ జోడో యాత్ర ఎందుకు చేశారని ప్రశ్నించారు. మోడీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఏమి చేయలేరని రాజ్ నాథ్ అన్నారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప బీజేపీ విజయానికి శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితులతో సీఎం పదవి నుంచి తప్పుకుని పార్టీకి సేవలను కొనసాగిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం కర్ణాటక పురోగతికి దోహదపడుతూ, మేక్ ఇన్ ఇండియా మంత్రాన్ని పాటిస్తుందని అన్నారు. కాగా, బుధవారం జేపీ నడ్డా సంకల్ప్ యాత్ర మొదటి భాగాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి 8 వేల కిలోమీటర్ల మేర ఈ యాత్రను చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.